నూతన ఎస్‌ఐ గా నాగరాజు బాధ్యతల స్వీకరణ
చిన్నంబాయి 05నవంబర్ 2025 తెలంగాణ వార్త : చిన్నంబావి మండల ఎస్‌ఐ గా నాగరాజు బాధ్యతలు తీసుకున్నారు ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ బదిలీపై వెళ్లగా నారాయణ పేట వీ ఆర్ లో ఉన్న విధులు నిర్వహిస్తున్న నాగరాజు బదిలీపై ఇక్కడికి వచ్చారు.పోలీసుస్టేషన్ సబ్‌ఇన్సపెక్టర్‌గా నాగరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామ న్నారు. అసాంఘిక కార్యక్రమా లు, జూదం, అక్రమ మద్యం విఘాతం కలిగించకుండా మండల ప్రజలు సహకరించాలని కోరారు విధులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారిపై అయినా చర్య తప్పవని హెచ్చరించారు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు.