నూతన ఎంపీడీఓను సుర్ణ ఆదర్శ్ గౌడ్‌ కు పాత్రికేయుల సన్మానం

Nov 6, 2025 - 19:04
 0  4
నూతన ఎంపీడీఓను సుర్ణ ఆదర్శ్ గౌడ్‌ కు పాత్రికేయుల సన్మానం

చిన్నంబావి06నవంబర్ 2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల కేంద్రంలో  ఇటీవల నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన సుర్ణ ఆదర్శ్ గౌడ్‌ ను గురువారం మండల నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు  అభినందనలు తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సుర్ణ ఆదర్శ్ గౌడ్, మాట్లాడుతూ, మండల అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా అమలవుతాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఫ్రెంట్ మీడియా సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు.పాత్రికేయులు కొత్త ఎంపీడీఓ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రామస్వామి. రిపోర్టర్లు డేగ శేఖర్,చారకొండ బాబు,ఎస్ శ్రీనివాసులు,తగరం చిన్న కుర్మయ్య,విష్ణు,ఆంజనేయులు,పెరుమాళ్ళ వెంకటేష్, శివ కృష్ణ,దేవని కురుమయ్య,తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333