గాలికుంటు వ్యాధి టీకాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Mar 21, 2024 - 20:28
Mar 21, 2024 - 21:04
 0  2
గాలికుంటు వ్యాధి టీకాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

తుంగతుర్తి మార్చి 21తెలంగాణవార్త ప్రతినిధి :- పశువులలో వచ్చే గాలు కుంటి వ్యాధి టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి ప్రసాద్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పశువులకు గాలుకొంటూ వ్యాధి టీకాల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రతి రైతు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించుకోవాలని లేనిపక్షంలో పశువులు మరణించే ప్రమాదం ఉందన్నారు. పాలిచ్చే పశువుల్లో టీకాలు వేయించినట్లయితే పాల దిగుబడి పూర్తిగా పడిపోయే అవకాశం ఉందన్నారు సూడి కట్టిన పశువులు గాలుకుంటి వ్యాధి సోకినట్లయితే కడుపులో దూడలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు 197 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇట్టి టీకా కార్యక్రమం వచ్చే నెల 14 వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు సుష్మ బుచ్చిబాబు మహేష్ రైతులు ఫజారుద్దీన్ ,రాజు, వీరయ్య వెంకన్న శీను తదితరులు పాల్గొన్నారు.

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.