నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసి
, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు
కోరుట్ల, 25 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.*
కోరుట్లలో మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అలవాల గంగాధర్ దంపతులు ఇటివల మృతి చెందడంతో వారి ఇద్దరు కూతుళ్లు అనాధలుగా మారారు. వీరికి మంగళవారం కోరుట్ల ప్రెస్ క్లబ్ తరఫున క్వింటాలు బియ్యం అందజేయగా, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసి, వీరిని ఉన్నత చదువులు చదివిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముఖ్యర చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, సీనియర్ పాత్రికేయులు గోడికె రాజు, గజం శంకర్, చంద్ర ప్రకాష్, పరంధామ్, తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టైగర్ అలీ నవాబ్, కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నగనూరి గంగాధర్, కొంతం రాజం, సత్యనారాయణ రాధాకృష్ణ, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.