ఉపాధ్యాయ MLC ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు.
సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

- బందోబస్తు కి 300 మంది పోలీసులు.
- 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉన్నది.
- ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతి లేదు.
- పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి.
.... సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
27వ తేదీన జరగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ MLC ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఐపిఎస్ గారు తెలిపినారు. ఎన్నికల సామాగ్రికి రక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందికి అధికారులకు సూచించారు. ఎన్నికల సామాగ్రి తరలించడం, వాటికి రక్షణ కల్పించడం పోలీసు ప్రాథమిక విధి, మార్గం లో అన్ని స్థితిగతులు పరిశీలించాలి, ఇబ్బందులు వస్తే అధికారులకు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులకు సమాచార ఇవ్వాలి అన్నారు. పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు క్యూ లైనులో ఉండాలి అన్నారు, పోలీసులు పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్ లోకి వెళ్ళవద్దు అని సూచించారు. ఇతరులను పోలింగ్ బూత్ లోకి అనుమతించద్దు అన్నారు.
ఈ నెల 27 వ తేదీన జరుగనున్న నల్గొండ- ఖమ్మం - వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ MLC ఎన్నికలకు సంభందించి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మొత్తం 23 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ జరుగుతుందనీ పోలింగ్ జరుగుతుంది. దీనికి సంభందించి 300 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు తెలిపినారు. ఆయుధ పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతుంది అన్నారు. 7 రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. 23 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశాం అన్నారు. పోలింగ్ బూత్ ల వద్ద స్టాటిస్టికల్ సిబ్బంది ఉంటారు. CC కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది అన్నారు. పౌరులు, ఓటర్లు నియమ నిబంధనలు పాటించాలి అని ఎస్పి గారు కోరారు. ఓటరు గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలి, క్యూ లైనులో నిల్చొని ఓటు వెయ్యాలి. ఎన్నికల సిబ్బందికి ప్రతిఒక్కరూ సహకరించాలి. ఎవరూ తగాదాలు పెట్టుకోవద్దు, బయట ప్రచారం చేయవద్దు, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు పోలింగ్ బూత్ లోకి అనుమతి లేదు అని గ్రహించాలి అన్నారు. 163 BNSS సెక్షన్ (144సెక్షన్) అమలులో ఉన్నది, పోలింగ్ బూత్ వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయి అన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు వెయ్యాలి అన్నారు.