నా హయాంలో కొత్త బ్రిడ్జిని తప్పకుండా నిర్మిస్తా

Sep 4, 2024 - 20:05
 0  10
నా హయాంలో కొత్త బ్రిడ్జిని తప్పకుండా నిర్మిస్తా

తుంగతుర్తి: సెప్టెంబర్ 4 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎమ్మెల్యే మందుల సామిల్.......  గత ప్రభుత్వ దద్దమ్మ పాలకులు చెయ్యలేని పనిని నేను చేస్తానన్న ఎమ్మెల్యే.... గత ఎమ్మెల్యే ఇసుక మీద డబ్బులు సంపాదించడమే తప్ప మరేమీ చేయలేదు..... సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి . అందువలన తుంగతుర్తి మండలం లోని వెలుగు పల్లి కేశవపురం గ్రామాల మధ్య  రుద్రమ్మ చెరువు వాగు పొంగి పొర్లుతున్నది . ఈ వాగు  వలన రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కావున తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామిల్ గ్రామాలలోని పరిస్థితులను పరిశీలించే దిశగా వెలుగు పల్లికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ వాగు పైన కొత్త బ్రిడ్జిని కచ్చితంగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కేశవపురంలోని సుమారుగా 1500 మంది ప్రజల అన్ని సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గత ప్రభుత్వ స్థానిక మంత్రి ఎమ్మెల్యేలు కలిసి ఇసుక దందా చేసి డబ్బులు సంపాదించడం తప్ప ప్రజల స్థితిగతులను పట్టించుకున్న పాపాన పోలేదు. పది సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఏ ఒక్క బ్రిడ్జిని నిర్మించలేదని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి డిసిసిబి , డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి  సైదులు , ఏఐసిసి మెంబర్ గుడిపాటి నర్సయ్య , తుంగతుర్తి మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333