నాగర్ కర్నూల్ పార్లమెంటులో త్రిముఖ పోరు.
*గ్రామాలకు చేరని కాంగ్రెస్ ప్రచారం.*
నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు.
సామాజిక వర్గాన్ని ఏకం చేసుకుంటున్నా ఆర్ఎస్పి.
ప్రచారంలో దూకుడు పెంచిన ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్.
అలంపూర్ నియోజకవర్గ పరిధిలో చాప కింద నీరుల విస్తరిస్తున్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
జోగులాంబ గద్వాల 4 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్ నాగర్ కర్నూలు జిల్లా వాసి, పుట్టింది- అలంపూర్, పెరిగింది అచ్చంపేట నాగర్ కర్నూల్, వయసు 56 సంవత్సరం, నేటికీ ప్రతిరోజు 10 కిలోమీటర్లు పరిగెత్తే శారీరక దృఢత్వం కలవాడు, చదువు B,Vsc. MVsc. గోల్డ్ మెడల్ ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో అమెరికాలో మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ ట్రెషన్ చదివి మొట్టమొదట తెలంగాణ ఐపీఎస్ అధికారి, అలంపూర్ నియోజకవర్గంలోని మూడు పార్టీల అభ్యర్థుల మధ్యలో పోటీ బలంగా నడుస్తుంది ప్రచారాలు కూడా అదేవిధంగా కల్పిస్తున్నాయి. మొదటగా బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి అనుకూలంగా ఉంది. భారీ మెజార్టీతో గెలిచే ఊహాగానాలు వెలుపడ్డాయి. అయితే ఇప్పుడు రోజుకు చినికి చినికి త్రిముఖ పోరుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు గ్రామస్థాయిలో ప్రచారం నిర్వహించడం లేదని విమర్శలు పార్టీ కార్యకర్తల నుండే వస్తున్నాయి .కనీసం ప్రచార వాహనాలు కూడా తిరగలేదు. ఇన్చార్జీలు పార్లమెంటు నియోజకవర్గం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి .వాట్సాప్ లలో ప్రతిపక్షాలు పెట్టే పోస్టులకు సమాధానం చెప్పే వారే కరువయ్యారు కొన్ని గ్రామాలలో పాలకులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉన్నారని మాటలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇన్చార్జిలను ప్రశ్నిస్తే గ్రామాలకు ప్రచార వాహనాలు పంపించారని చెబుతున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటుపై అధిష్టానం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. దూకుడు పెంచిన భరత ప్రసాద్ పైపు బిజెపి పార్టీ అభ్యర్థి ప్రచారాన్ని బలంగా చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ఎమ్మార్పీఎస్ నాయకులు కూడా బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. ఆ పార్టీకి అంతా క్యాడర్ లేకున్నా కానీ ప్రచారంలో స్పీడ్ పెంచారు. వారు కూడా గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థి యువకుడు కావడంతో యువత ను ఆకర్షించుకున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం సంక్షేమాలను తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు. పరుగులు పెట్టిస్తున్న ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ దూకుడు పెంచారు మొదటగా అంతగా ఆదరణ రాలేదని మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మంచి ఆదరణ కల్పిస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అనుభవం. 26 సంవత్సరములు అత్యున్నతమైన ఐపీఎస్ ప్రభుత్వ సర్వీసులో సేవలు. హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ మరియు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా సేవలందించారు. కరీంనగర్ అనంతపూర్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. గురుకులాల కార్యదర్శిగా దాదాపు పది సంవత్సరాలు పనిచేసి 10 లక్షల మందికిపైగా నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి చదువులను అందించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలెట్లుగా లాయర్లుగా ప్రయోజకులను చేశారు. కన్న బిడ్డలకు రిజర్వేషన్లు వదులుకున్న నీ స్వార్థపరుడు అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉండి కూడా సొంత ఇల్లు కట్టుకోలేదు ఇప్పటికే అద్దె ఇంట్లోనే నివసిస్తున్న నాయకుడు. ప్రతి సంవత్సరానికి నాలుగు వందల మంది విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీల్లో గురుకుల విద్యార్థులచే బంగారు పతకాలను సాధించాలని కృషి చేశారు. నిరుపేద గిరిజన బాలిక మరియు నిరుపేద దళిత బాలుడిచే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిదింపజేసి చెక్కుచెదరని అంతర్జాతీయ స్థాయి రికార్డులను నమోదు చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిపిస్తే నాగర్ కర్నూల్ ప్రాంతానికి ప్రపంచ స్థాయి అభివృద్ధిని అందించి నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలుపుతా అని ఆయన అలంపూర్ ప్రజలను కోరారు.