సిపిఐ ఎన్నికల సన్నాహక సమావేశం.
జోగులాంబ గద్వాల 4 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ముఖ్య అతిథులు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై దిశానిర్దేశం చేశారు . ఓట్లకోసం మోడీ బిజెపి సాగిస్తున్న అబద్దపు, విచ్చిన్న రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు . ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన నాల్గు జిల్లాల సిపిఐ జిల్లా సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల జిల్లా బాద్యుల సమావేశం CPI నాగర్ కర్నూల్ పార్టీ కార్యాలయం లొ జరిగింది. ఇండియా కూటమి సీపీఐ బలపరిచిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి గెలుపుకై మద్దతు ను ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన గద్వాల, నగర్ కర్నూల్, వనపర్తి, జిల్లాల సమావేశానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగినది. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చి మద్దతూ అడగడం జరిగింది.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు మంచి చేసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నాడు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మతాల పేరిట, కులాల పేరిట చిచ్చులు రేపి వాటిని రాజకీయాల కనుగుణంగా మార్చుకుంటున్నాడు అని అన్నాడు. సిల్లీ మాటలు అబద్దాలతో మాత రాజకీయాలతో ఈదేశం పరువుని మంటగలుపుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విధానాలకు వెతిరేకంగా మాటలు చేష్టలు ఉండడం బాధాకరం అన్నారు సాక్షాత్తు ప్రధానమంత్రే ఫేక్ మాటలు కుట్ర కుతంత్ర రాజకీయాలు చేయడం భారత వ్యవస్థ నిర్మాణానికి పెను ప్రమాదం అన్నారు.నేడు దేశాభక్తులు దేశాద్రోహులుగా దేశాద్రోహులు భక్తులుగా కీర్తించ బడటం విపరీత పరిణామలకు సాంకేతంగా కన్పిస్తుందని స్పష్టం చేశారు అందుకే బిజెపి పార్టీ ని ఓడించాలని ఆయన అన్నారు.ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సమితిలో గద్వాల, వనపర్తి ,నాగర్ కర్నూల్, రంగారెడ్డి నాలుగు జిల్లాల కార్యదర్శులు, మండల కార్యదర్శులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో CPI గద్వాల జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాల పేరిట ప్రజలకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. అలాగే సిపిఐ బలపరిచిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థి డాక్టర్ మల్లు రావు గారిని గెలిపించి బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని, ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా సమితి తరపున AIYF జిల్లా అధ్యక్షులు కృష్ణ, AITUC కాశిం, AISF ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రవీణ్, సహాయ కార్యదర్శి హనుమేష్, సీపీఐ కార్యవర్గ సభ్యులు పెద్దబాబు పాల్గొనడం జరిగింది.