పచ్చదనానికి నిలువెత్తు రూపం వనజీవి రామయ్య

Apr 12, 2025 - 23:39
Apr 12, 2025 - 23:40
 0  5
పచ్చదనానికి నిలువెత్తు రూపం వనజీవి రామయ్య

పద్మశ్రీ వనజీవి రామయ్య చిరస్మరణీయులు 

ప్రకృతి ప్రేమికులు దరిపల్లి రామయ్య సేవలు ఎనలేనివి 

పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మృతి దేశానికి తీరని లోటు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి (చెట్ల )రామయ్య గారు ఈరోజు ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 88వ ఏటా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు ప్రకృతిని ప్రేమిస్తూ మొక్కలను నాటుతూ సమాజానికి సేవలందించారు సుమారు కోటి మొక్కలకు పైగా మొక్కలు నాటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా భారత దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు మార్చి 30 2017 వ సంవత్సరంలో దరిపల్లి రామయ్య సేవలను గుర్తించి న భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిచే పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ముఖ్యమంత్రిలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్లచే ఎంతోమంది ప్రముఖులచే ప్రశంసలు పొందారు ఆయన లేని లోటు ప్రకృతికి దేశానికి తీరని లోటు ఆయన సేవలు ఎనలేనివి మొక్కల గురించి వాటి ప్రాధాన్యత గురించి పచ్చదనం గురించి అవగాహన కల్పిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమయ్యారు గొప్ప వన ప్రేమికుని కోల్పోయాం ఆయన భవిష్యత్తు తరాలకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప మార్గదర్శకులు ఆయన వన హరిత వనం మార్గంలో ఎంతో మంది ప్రకృతి ప్రేమికులుగా 

వ న ప్రేమికులుగా మొక్కలు నాటి ఆక్సిజన్ అందించే మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు భారత దేశంలో చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్లాల్ బహుగుణ తర్వాత అంతటి ప్రకృతి ఉద్యమాన్ని నడిపిన

 వ న జీవి రామయ్య గారు చిరస్మరణీయులు ప్రకృతి తో మమేకమై తన జీవితాన్ని త్యాగం చేశారు అవిశ్రాంత పోరాట యోధుడు వనజీవి రామయ్య గారు వారి త్యాగం వృధా కాదు ఆయనతో గత తొమ్మిది సంవత్సరాల నుండి అనుబంధం కలదు ప్రకృతి ఒడిలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నాము మొక్కలంటే ఆయనకు ప్రాణం వాటిని కన్నబిడ్డ లాగా చూసుకునేవారు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాము ఆయన ఆశయాలను సాధిస్తాము పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము

డాక్టర్ దైద వెంకన్న అనిత 

ప్రకృతి ప్రేమికులు 

హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు 

సింధు ఆర్ట్స్ అకాడమీ 

వ్యవస్థాపక అధ్యక్షులు

 ప్రధాన కార్యదర్శి 

సూర్యాపేట జిల్లా

 తెలంగాణ రాష్ట్రం

9666116850

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333