నల్ల  బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరైన  వ్యవసాయ శాఖ ఏఈఓ లు

Oct 1, 2024 - 19:32
 0  6
నల్ల  బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరైన  వ్యవసాయ శాఖ ఏఈఓ లు

జోగులాంబ గద్వాల 1 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ క్రాప్ సర్వే  క్లస్టర్ మొత్తం ఒక AEO చేయటం కష్టతరమైనది కావున ఇట్టి DCS  ( Digital Crop Survey ) సర్వే కొరకు గ్రామ స్థాయిలో సహాయకులు నియమించాలని రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు కి సమస్యలు విన్నవించినా ఇంకా పరిష్కారం చూపకుండా,AEO లపై DCS సర్వే కొరకు ఒత్తిడి తీసుకొస్తునందుకు నిరసనగా రాష్ట్ర వ్యవసయ విస్తరణ అధికారుల రాష్ట్ర వ్యవసాయ శాఖ జేఏసీ ఐకాస పిలుపు మేరకు ఈరోజు ఐజ మండలం లోని AEOలు నల్ల బ్యాడ్జి లు ధరించి విధులకు హాజరవడం జరిగింది. 

    అలాగే  జోగులాంబ గద్వాల్ జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఈ విధంగా నిరసన లో పాల్గొన్నారు అని జిల్లా ఏఈఓ సంఘం అధ్యక్షులు లోకరాజు అన్నారు. మా యొక్క విన్నపం ప్రభుత్వ పెద్దలు ఆలోచించి ఈ DCS (Digital Crop Survey ) వెసులుబాటు కల్పించాలని  కోరడం జరిగింది .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333