దోమల నివారణకు కొరకు శానిటేషన్ కార్మికులకు కొత్త స్ప్రేయింగ్ పంపులను
అందజేసిన మున్సిపల్ చైర్మన్,కమిషనర్
జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి. గద్వాల. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం నందు 37 వార్డులలో కాలువలపై మలతిన్ మరియు యాంటీ లార్వా దోమల నివారణ కొరకు కొత్త స్ప్రేయింగ్ పంపులను ప్రత్యేకంగా తెప్పించి మున్సిపల్ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్,మున్సిపల్ కమిషనర్ శ్రీ దశరథం చేతుల మీదుగా శానిటేషన్ కార్మికులకు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రతి వార్డులలో ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. దోమల వల్ల డెంగ్యూ,మలేరియా టైఫాయిడ్, విష జ్వరాలు తదితర వ్యాధులు ప్రభులే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల మురికి నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని గద్వాల ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీను శ్రీరాములు మున్సిపల్ అధికారులు,మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ జవాన్లు శానిటేషన్ లేబర్స్ తదితరులు ఉన్నారు.