నల్లమాద కుటుంబానికి నమ్మిన బంటు బసవన్న...

మునగాల 29 సెప్టెంబర్ 2025
తెలంగాణ వార్త ప్రతినిధి :-
అణగారిన వర్గాల్లో పుట్టిన బసవన్నకు ఆకలి బాధలే కాదు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం న్యాయ పోరాటాలు తెల్సినోడు.పాటతో పయనమైన మాతంగి కోదాడ నియోజకవర్గంలో ఎన్నో ప్రజా పోరాటాల్లో నాయకుడై ఉత్తమ్ కుటుంబానికి నమ్మిన బట్టుగా దగ్గరయ్యిండు.
కాంగ్రెస్ వామపక్షాల పొత్తులో భాగం నుండి ఉత్తమ్ సార్ గెలుపులో అగ్రస్థాయిలో కార్యకర్త పాత్రను పోషించి వారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో దళితలర్గాలకు చెందిన బలమైన నాయకుడిగా అమ్మ పద్మావతిగారి ప్రతీ గెలుపులో ప్రచార రథసారథిగా నిలబడినోడు మన బసవన్న
పార్టీపట్ల మరియు పార్టీ అధినాయకత్వం పట్ల వినయం విధేయతకు కేరాఫ్ గా ఉంటూ కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ గెలుపులో పద్మావతమ్మ అభివృద్ధి బాటలో భాగస్వామ్యిగా మసలుకుంటున్నోడు మన మునగాల మండల ప్రజా గొంతుక మాతంగి బసవన్న
ప్రజల కన్నీటి బాధలు తెల్సినోడు,నీతిగల్గిన రాజకీయ చరిత్ర ,మొదటి నుంచి ప్రజలపక్షాన నిలబడ్తూ ప్రతిపక్షాల మన్ననలు సైతం పొందగల్గిన ఏకైక నాయకుడు మాతంగి బసవన్న అంటే అతిశయోక్తి కాదు!
సీత-రాములోరికి హనుమంతుడిలా మన ఉత్థమ్ కుమార్ రెడ్డి పద్మావతమ్మ గార్లకు నమ్మిన బంటోలే మన మాతంగి