5వ, రోజుకు చేరుకున్న  ముదిరాజ్ ప్రజా చైతన్య బస్ యాత్ర

Jan 22, 2025 - 20:16
 0  7
5వ, రోజుకు చేరుకున్న  ముదిరాజ్ ప్రజా చైతన్య బస్ యాత్ర
5వ, రోజుకు చేరుకున్న  ముదిరాజ్ ప్రజా చైతన్య బస్ యాత్ర
5వ, రోజుకు చేరుకున్న  ముదిరాజ్ ప్రజా చైతన్య బస్ యాత్ర

 జోగులాంబ గద్వాల22 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. తేదీ.21/1/2025  సాయంత్రం : 6;00 pm గంటలకు  ముదిరాజ్ ప్రజా చైతన్య బస్సు యాత్ర ముదిరాజ్ నాయకులకు స్వాగతం పలికిన రాఘవేంద్ర ముదిరాజ్ యాత్ర సభ్యులకు . అనంతరం స్థానిక ముదిరాజ్ సంఘాల జిల్లా ముఖ్య నాయకులు , వివిధ పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడుతూ, యువకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోశించినట్లు నేడు యువత మన జాతి కొరకు సంఘాలు ఏవైనా ముఖ్య అంశం అయిన రిజర్వేషన్ కోసం కష్టపడాలని డా.శివ ముదిరాజ్ బృందాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువకులనుద్దేశించి మాట్లాడారు.ఆ తదనంతరం డా. శివ ముదిరాజ్  మాట్లడుతూ, ముదిరాజుల యొక్క ప్రధాన డిమాండ్లు అయినటు వంటి  BC -D నుండి BC -A లోకి రాకపోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక నష్టాలను , సామాజిక వెనకబాటు తనం , రాజకీయ వెనకబాటు తనం గూర్చి చెప్తూ వాటి రూపుమాపాలనే ఉద్దేశ్యంతో యాత్ర చేస్తున్నామని దానికి యువ ముదిరాజుల తోడ్పాటు ఎంతో కీలకమన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంను ఉద్దేశించి పండగ సాయన్న జయంతి & వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వేదిక నుండీ కోరడం జరిగింది..అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కూడా ముదిరాజ్ సోదర, సోదరీమణులకు ఖచ్చితంగా అధిక సంఖ్యలో టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేయటం జరిగింది. యాత్రకు సంఘీభావం తెలుపుతూ సహకరించిన కుల పెద్దలు , వివిధ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ..

   ఈ బస్ యాత్రలో బ్రహ్మం ముదిరాజ్ , సాయికిరణ్ ముదిరాజ్, మహేష్ బాబు ముదిరాజ్, దశరథం ముదిరాజ్, మురళి ముదిరాజ్,శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ మహాసభ గౌరవ అధ్యక్షులు రేలంపాడు నరసింహులు మదనపల్లి ఆనందు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి లక్ష్మన్న కోశాధికారి రేకులపల్లి సవరణ జనరల్ సెక్రెటరీ బీచుపల్లి మున్సిపాలిటీ ఘటన కొండపల్లి పరమేష్ కొత్తపల్లి సత్యనారాయణ మరియు సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333