దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, అంతరాలు, వివక్షత లేని, సమాజం కోసం

Apr 6, 2024 - 20:44
 0  4

అలుపెరుగని పోరు చేసిన రాజకీయ,సామాజిక విప్లవ యోధుడు బాబూజగ్జీవనరాం.

----వడ్డేపల్లి మల్లేశము

అధ్యయనము, సంకల్పబలం, ఆత్మస్థైర్యం ,ధైర్యము, చర్చించే తత్వము,
  విధేయత వంటి కిట్టు లక్షణాలు ఉండటం వల్లనే  78 ఏళ్ల జీవితంలో 52 ఏళ్లు రాజకీయరంగంలో గడిపి వర్తమాన రాజకీయాలను ,చరిత్ర గతిని శాసించగలిగి
నాడు కనుకనే భారతదేశంలో బాబు జగ్జీవన్ రాం పొలిటికల్ కింగ్ మేకర్ అని అనిపించుకున్నాడు. 33 ఏళ్లు కేంద్రమంత్రిగా కొనసాగితే 52 సంవత్సరాలు పార్లమెంటును 
 ఏలిన అనుభవం ఉంది. కాంగ్రెస్కు నెహ్రూకు నమ్మినబంటుగా ఉన్నప్పటికీ 1975 లో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని పెట్టినప్పటికీ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసినాడు.

ప్రజలంతా ఆత్మీయంగా"బాబూజీ"
 అని పిలుచుకునే జగ్జీవన్రామ్ 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్లోని షాబాద్ జిల్లా చాందవా  గ్రామములో  వసంతీదేవి,శోబీ రాం
 దంపతులకు జన్మించినాడు. 1920లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ , 1931లో బీఎస్సీ పట్టా అందుకున్నారు.

పాఠశాల విద్య -అవ మానం:-

--- దళిత కులంలో జన్మించిన కారణంగా పాఠశాల స్థాయిలో  కుల వివక్షత బలంగా ఉండేది. తను చదువుతున్న పాఠశాల లో రెండు కుండల పద్ధతి" హిందూ 
 పానీ", "ముస్లిం పానీ" పేరుతో మంచినీటి సౌకర్యం ఉండేది. జగ్జీవన్రామ్ హిందూ పని కుండలోని నీరు తాగడంతో హిందూ పిల్లలు నీరు త్రాగడం మానివేయడం నిరసన తెలిపారు. ఆయన అప్పుడు హిందూపాని ఉండను రాయితో పగలగొడితే హరిజన్ పానీ అనే పేరుతో మరో కొండను ప్రధానోపాధ్యాయుడు ఏర్పాటు చేయగా తనతో దానిని కూడా పగలగొట్టాడు. జరిగిన పొరపాటుకు చింతించి ప్రధానోపాధ్యాయుడు అప్పటినుండి ఓకే కొండలు పెట్టినాడు . జగ్జీవన్ రామ్ నిరసనతో వివక్షతను గెలిచినా ఆవేదనతో కుమిలిపోయి కోపంతో ఊగిపోయాడు.
 ఈ సంఘటన ఆయనను దళితుల జాగృతి కై సాగడానికి సామాజిక సంస్కరణకు పూనుకోవడానికి వేదిక అయ్యింది.
         అసమానతలు, అంతరాలు, వివక్షత బలంగా ఉన్న కాలమది. ఉత్తమ పార్లమెంటేరియన్ గా సామాజిక సంస్కరణ 
కర్తగా స్వపక్షం తోపాటు ప్రతిపక్షాలతో సైతం మెప్పు పొందిన జగ్జీవన్రామ్ గాంధీజీ ప్రేరణ తో, స్ఫూర్తితో 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని లాఠీలకు బెదరకుండా ఈరోజుతో పోరాటం కొనసాగించారు.
 1935లో దేశంలోనే అతి పిన్న వయసులో 
 20 ఏళ్లకే బీహార్ నుండి ఎమ్మెల్సీ కాగా 1942లో సాగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టైన స్వాతంత్ర్య సమర యోధుడు.
- తొలిసారిగా నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జగ్జీవన్రామ్ ఆ తర్వాత వ్యవసాయము ,రక్షణ, ఆరోగ్య ,రైల్వే మంత్రిత్వ శాఖలతో పాటు 977 నుండి 79 వరకు మురార్జీ దేశాయ్ మంత్రివర్గంలో ఉపప్రధానిగా పనిచేసి అత్యున్నత పదవిలో అత్యంత విలువైన సేవలందించిన జగ్జీవన్ రామ్ చరిత్ర రాజకీయ రంగంలోని వారికి తప్పక తెలుసుకోదగిన అనుభవ పాఠమే.
- అత్యంత కీలకమైన 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా సేవలందించి తన విజ్ఞతను ,దార్శనికతను ప్రదర్శించారు.
     పోరాటాలు -ఏర్పాటు చేసిన సంస్థలు- దార్శనికత:-
                తన జీవితంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు, వివక్షతను ఎదుర్కొని అనుభవసారం తో సమాజాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అంచెలంచెలుగా ఉపప్రధానిగా ఎదగడానికి కారణం దీక్షా, క్రమశిక్షణ, పట్టుదల, సేవానిరతి, త్యాగం, సంకల్పబలం, సమాజాన్ని సంస్కరించాల నే తపన.
 ఇలాంటి లక్షణాలను జీవిత అనుభవాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా చరిత్ర ద్వారా సమాజం పురోగమన మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది .అందుకే మహానుభావుల చరిత్రను అధ్యయనం చేయడం విద్యార్థులు ,ఉపాధ్యాయులతో పాటు విద్యావంతులు, అందరి బాధ్యత కర్తవ్యం కూడా.
          వెనుకబడిన వర్గాలకు ,మహిళలకు,
 ప్రత్యేకంగా దళితులకు హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం, అవకాశాలను కల్పించడం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయితే ఆ రాజ్యాంగ మును అనుసరించి ఆయా వర్గాలకు సంబంధించిన చట్టాలను తయారుచేయడం చట్టాల అమలుకు సంబంధించి
 బహుగా కృషి చేసినవారు జగ్జీవన్రామ్.
 అవమానాలు, అటంకాలు ,వివక్షతలను విజయాలుగా మలచుకున్న ప్రదాత అయిన జగ్జీవన్రామ్ సామాజిక ఉద్యమాలను విద్యార్థిగా ఉన్న దశలోనే నిర్మాణము చేసినాడు, పాల్గొన్నాడు. జాతి దశలోనే బ్రిటిష్ సంకెళ్లను  తెంపి స్వాతంత్ర్యాన్ని సాధించి సామాజిక సమానత్వ నిర్మాణానికి కలలుగన్నాడు.

 పోరాటాలు-

తన స్వశక్తితో కలకత్తాలోని వెల్లింగ్టన్ స్క్వేర్ లో స్వాతంత్ర్య కాంక్షను బహిర్గతం చేయడానికి 35 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించి సఫలుడై
 సుభాష్ చంద్రబోస్, ఆజాద్ ల దృష్టిలో పడ్డాడు.

  • 1935లో కాన్పూర్లో అణగారిన వర్గాల లీదు సదస్సుకు అధ్యక్షత వహించడం ఏ కాకుండా ఈ సంస్థ తో పాటు వ్యవసాయ కార్మిక మహాసభను స్థాపించి నిర్వహించినాడు. ఆల్ ఇండియా డిప్రెషన్ క్లాస్ లీగ్ సంస్థకు 936 నుండి 42 వరకు అధ్యక్షునిగా పని చేసినాడు.
         సేవ, అధ్యయనము, రచయిత, దార్శనికత:-
  • దళితులను ఐక్యం చేయడం ద్వారా చైతన్యము పెంపొందించి, దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని విముక్తి చేయడంతోపాటు, సామాజిక రుగ్మతలను పరిష్కరించే దిశగా సాంఘిక సంస్కరణలకు పూనుకొని, అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం డిమాండ్ చేసి అవకాశాలను
     ఎందరికో కల్పించి అత్యున్నత స్థాయికి చేరుకున్న  నాయకుడిగా జగ్జీవన్రామ్ పెద్ద రచయిత అంతేకాదు భవిష్యత్తును దర్శించిన దార్శనికుడు కూడా. హిందీ ఇంగ్లీషు లో అనేక రచనలు చేసినప్పటికి
    1 భారతదేశంలో సవాళ్ళు2 జీవన సరళి వ్యక్తిత్వ వికాసం అనే ఈ రెండు గ్రంథాలు ప్రధానమైనవి.
  •  కుల రహిత, వర్గ రహిత భావజాలం
  • గల జగ్జీవన్రామ్ ఆ కోణంలో సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడే కమ్యూనిస్ట్ మేని
    ఫెస్టో, పెట్టుబడి గ్రంథాలతో పాటు ఇతర సోషలిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి సమాజాన్ని దేశరాజకీయాలను ఆ కోణంలో తరచుగా విశ్లేషించే వాడు.
          1934లో బీహార్లో భూకంపం వచ్చినప్పుడు తన అనుచర బృందంతో పాటు ప్రజలను మేల్కొలిపి బాధితులకు అన్ని  రకాల సహాయాన్ని అందించి వసతులను సమకూర్చి  తమ సామాజిక బాధ్యతను ప్రదర్శించారు. ఈ భూకంపం సందర్భంగా గాంధీని జగ్జీవన్రామ్ మొదటిసారిగా కలుసుకున్నాడు. అంతే కాదు ఈయన జనామోదం కలిగిన ప్రజావళిని మెప్పించ గలిగిన గొప్ప వక్త కూడా. 1935 జూన్ 1వ తేదీన కాన్పూర్కు చెందిన డాక్టర్ బీర్బల్ కుమార్తె అయిన ఇంద్రాణి దేవిని పెళ్లి చేసుకున్న జగ్జీవన్ రాం ఇరువురు కలిసి స్వతంత్ర పోరాట యోధులు గా ఉద్యమంలో పాల్గొనడం విశేషం. విద్యావేత్త సంఘసంస్కర్త అయిన ఇంద్రాణి దేవి భర్తకు తగిన భార్య గా సామాజిక, రాజకీయ రంగంలో పని చేయడంతో పాటు ప్రోత్సహించడము వీరి అంచెలంచెల ఎదుగుదలకు కలిసివచ్చిన అవకాశం.
              సామాజిక రాజకీయ రంగంలో పదవులు అలరించడం ఒక ఎత్తయితే ఆ పదవులకు వన్నె తేవడంతో పాటు సామాజిక స్పృహ గల భావజాలం కలిగి ఉండటం ఆ వైపుగా పోరాటాలు కార్యక్రమాలలో పాల్గొనడం ఆచరించడం ద్వారా వ్యక్తిత్వ లక్షణాలు ద్వారా ప్రజల గుర్తింపు పొందడం ఒక వ్యక్తి యొక్క ఉన్నత స్థాయికి నిదర్శనం బాబు జగ్జీవన్ రామ్  నెహ్రూ చెప్పినట్లుగా తనకంటూ ఓ చరిత్రను నిర్మాణం చేసుకున్నాడు. కనుకనే ప్రజల మనసును గెలుచుకొని ప్రజల హృదయాలను చూరగోని ప్రజల మనిషిగా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ నిలిచి వుంటాడు.

  • రచన:-
     వడ్డేపల్లి మల్లేశం సామాజిక విశ్లేషకులు
     అధ్యక్షులు జాగృతి కళాసమితి
     హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట.
    9014206412
    (బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్
    5,ని పురస్కరించుకొని వ్రాసిన వ్యాసం)
Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333