కరువుకు కాంగ్రెస్కు సంబంధం అంటగట్టి రాజకీయాలు చేస్తే నిగ్గు తేల్చే నిపుణులు నేరస్తులకు చురకలు అంటించాలి
పాలక ప్రతిపక్షాల మధ్య సంస్కారం,దుస్ప్రచారాలు,
భాష కొరవడుతుంటే మేధావులు న్యాయవ్యవస్థ కొరడా జలుపించాలి.
అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నాయకుల ప్రగల్భాలు సహించడమా?. లేదు లేదు....
---- వడ్డేపల్లి మల్లేశం
కాంగ్రెస్ రాగానే కరెంటు పోయినది అని టిఆర్ఎస్ ఆరోపిస్తుంటే 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదు అని ప్రభుత్వం సమాధానం ఇస్తున్నది. రైతుబంధు రైతులకు పంపిణీ చేయలేదు అని టిఆర్ఎస్ ఆరోపిస్తుంటే ఇప్పటికీ 64 లక్షల మంది ఖాతాల్లో రైతుబంధు వేశామని ఇంకా 5 లక్షల మందికి వేస్తే సరిపోతుందని టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలలో నెలల తరబడి పంచిన చరిత్ర లేదా అని ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే ఇందులో ఏది వాస్తవమో ఎలా తెలవాలి? రాష్ట్ర ఆవిర్భావానికి ప్రజా ఉద్యమాలు, ప్రజాసంఘాల పోరాటాలు, అఖిలపక్షాలు, రాజకీయ ఉద్యమాలతో పాటు కుల సంఘాలు, సబ్బండ వర్గాలు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది అనే చారిత్రక సత్యాన్ని విస్మరించిన బి ఆర్ ఎస్ తమ వల్లనే తెలంగాణ ఏర్పడినదని థాము తెచ్చిన తెలంగాణ తమ కళ్ల ముందే నాశనం అవుతుందని తెలంగాణ రాష్ట్రానికి తామే వారసులము హక్కుదారులము అనే రీతిలో మాట్లాడుతున్న సందర్భాన్ని మేధావులు న్యాయవ్యవస్థ పరిశీలించాలి.
తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన వాళ్లు, అనాధలుగా మిగిలిన వాళ్ళు, కొన ఊపిరితో ఉన్నవాళ్లు, కొట్టుమిట్టాడుతున్న వాళ్లు, ఆధరువు లేక ఆగమైన వాళ్ళు, కేసులతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు వేలాది కుటుంబాలు ఇప్పటికీ అరిగోస పడుతుంటే ఆ విషయంలో స్పందించని గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తమను హక్కుదారులుగా మలుచుకొని మాటలతో అంకెల గారెడి చేస్తే ఎలా? ప్రజల ఆగ్రహంతో ఓటమిపాలైన వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి బదులు ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను పక్కదారి పట్టించడానికి సభ్య సమాజం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అబద్ధాన్ని ఎలా నిజం చేయవచ్చు , ఒక నిజాన్ని ఇలా అబద్దం గా మార్చవచ్చు రాజకీయ పార్టీలకు బాగా తెలుసు కనుక కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మేడిగడ్డ తో పాటు మిగతా బారాజుల యొక్క అక్రమ నిర్మాణాలు, అడపాదడపా అక్కడక్కడ నాణ్యత లేక కూలిపోయిన కాలువలు, ట్యాంకులు, గోడలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అనేకం దర్శనమిస్తూనే ఉన్నాయి .24 గంటల కరెంటు పేరుతో ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నదని చెప్పినప్పటికీ తీరా ప్రభుత్వం మారిన తర్వాత లెక్కలు వేస్తే శ్వేత పత్రాల ద్వారా విడుదల చేసినప్పుడు డిస్కములకు విద్యుత్ బకాయిలు కోట్లలో ఉన్నట్టు తెలుస్తూ ఉంటే ఇదే నా ప్రభుత్వం? ఇదేనా నాణ్యత గల కరెంటు రహస్యం? అని అనిపించక మానదు. వందల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు రైతుబందు ఇచ్చి భూస్వాములకు వంతపాడినటువంటి గ త ప్రభుత్వం పేద వర్గాలకు, బీసీ వర్గాలకు, అట్టడుగు ఆదివాసి వర్గాలకు మాత్రం ఉపాధి కల్పనకు స్వయం ఉపాధి మార్గాలకు రుణ సబ్సిడీతో కూడిన ఎలాంటి సహకారాలు అందించని కారణంగా వేల లక్షల కుటుంబాలు వీధిన పడిన విషయాన్ని కూడా ఇక్కడ మేధావులు గమనించాలి. దళిత బందులో పది లక్షల రూపాయలు ఇస్తే సంపన్న వర్గాలకు కూడా ఇవ్వడం అసంబంధం కాగా, రైతుబంధులో పంటలు పండించని గుట్టలు చెట్లు, పుట్టలు ఇండ్ల స్థలాలకు కూడా డబ్బులను వెదజల్లి సుమారు 30 వేల కోట్లు అదనంగా ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన విషయాన్ని గమనించినటువంటి మేధావులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే . జాగో తెలంగాణ, తెలంగాణ ఉద్యమకారుల వేదిక, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, ఇతర స్వచ్ఛంద సంఘాలు ముఖ్యంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఆశిస్తూనే ప్రస్తుత అవినీతితో కూడిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఇచ్చిన పిలుపుకు స్పందించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన విషయం అందరికీ తెలిసిందే .ఒక పార్టీ పట్ల ఒక ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మరొక పార్టీకి అవకాశం కాగా కలిసివచ్చిన అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన చారిత్రక బాధ్యత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది అని గుర్తించడం అవసరం.
హేతుబద్ధతలేని ఆరోపణలు:-
కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని కరెంటు పోతుందని చీకట్లు, కమ్ముకుంటాయని కరెంటు మోటార్లు కాలిపోతాయని శాపనార్థాలు పెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం వర్షాభావ పరిస్థితుల గురించి అంచనా వేయకుండా తమ వళ్ళనే నష్టపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు నీటిని ఇవ్వలేని పరిస్థితిని అంచనా వేయకుండా ఇతరుల పైన అబాండం నెట్టడం చూసే వాళ్లకు నవ్వనిపించక మానదు . ప్రభుత్వం వెంట పడతాం , అవగాహన లేని, తెలివి లేని, పరిపాలన చేయరాని, దద్దమ్మ ప్రభుత్వాలు అంటూ టిఆర్ఎస్ అధినేత మాజీ మంత్రులు తరచుగా మాట్లాడడాన్ని రాజకీయ వ్యవస్థలో నెలకొన్న పెడధోరణిగా న్యాయవ్యవస్థ మేధావులు పరిగణించకపోతే చౌకబారు రాజకీయాలతో కునా రిళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా సంస్కార యుతంగా బాధ్యతాయుతంగా ప్రజల కోణంలో ప్రజల కోసం పనిచేయాలి. కానీ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మాట్లాడితే శిక్షించే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని మేధాయి వర్గం ఆలోచించాలి. గత నాలుగైదు సంవత్సరాలుగా ఏనాడు కూడా ఒకటో తారీకు వేతనాలు వేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు మాసాలుగా రెండు మూడు తేదీలలోనే వేతనాలను అందిస్తున్న విషయాన్ని కూడా గమనించాలి . 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లు ఈ రాష్ట్రాన్ని తామే తెచ్చినట్లు నిరంతరం ప్రకటించుకుంటూ ఈ జాగీరు తమదే అని భావించిన నేపథ్యంలో ప్రజా తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధించడం కోసం సాగుతున్నటువంటి పోరాటంలో పునరoకితం కావాల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఎందుకంటే కేవలం భౌగోళిక తెలంగాణ తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామి క విలువలను సాధించిన దాఖలా లేదు. పౌర హక్కులు ప్రజాస్వామ్కాకులు మానవ హక్కులు అనే పదాన్ని ఏనాడు కూడా గత ప్రభుత్వం ఉచ్చరించకపోగా కదిలితే సమావేశమైతే నిర్బంధం విధించిన చరిత్ర కలిగి స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే సూర్యుని పైన ఉమ్మి వేయడమే . గత సంవత్సరం కరువు కాటకాల వలన వడగళ్ల వాన వలన నష్టపోయినటువంటి పంటలకు ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు కేవలం ప్రకటనలతోనే సరిపెట్టిందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానం లేకపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఎకరాకు 25 వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం అంటే నేల విడిచి సాము చేయడమే కదా! ఈ వాస్తవాలను మేధావులు న్యాయవ్యవస్థ పరిశీలించకపోతే ఎలా ?ఈ సందర్భంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉన్నది. మేధావులు బుద్ధి జీవులు న్యాయని పును లతో ఒక స్వచ్ఛంద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసి తులనాత్మక అధ్యయనాన్ని ప్రారంభిస్తే గాని గత ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమం, ప్రజా ద్రోహం, ఈ ప్రభుత్వ విధానాల పైన ప్రజలకు సరైన సందేశాలను ఇవ్వలేం. ఆ రకమైనటువంటి పరిశీలన చేసినప్పుడు మాత్రమే చాటు మాటలు అబద్ధపు బూటకపు ప్రచారాలు అన్ని వెలుగులోకి వస్తాయి. నిజాల నిగ్గు తేలుతుంది నేరస్తులు ఎవరో తెలిసిపోతారు. నేరస్తులకు శిక్ష అప్పుడు పడితే అది ప్రజా కోర్టులో ప్రకటిస్తే అంతకుమించిన ప్రజా పరిపాలన అంటూ ఉండదు. ఆ వైపుగా కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోని స్వయంప్రతిపతి గల సంఘాన్ని వెంటనే ప్రకటించాలి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)