తెలంగాణను అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్

Feb 7, 2025 - 19:42
 0  6
తెలంగాణను అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం

లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని, అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ముందుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చెప్పారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా నాశనం చేశారని ఆరోపించారు. కెసిఆర్ అసమర్ద పాలన వలన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం కాలంలో అనేక హామిలను అమలు చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వఛ్చిన వెంటనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పధకాలు అమలు చేసి ప్రజా రంజకంగా ప్రజా పాలన నడుస్తుందన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో 55 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు.
కులగణను, ఆర్దిక సామాజిక సర్వేను ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని కొనియాడారు. బిసిల జనాభాను, వారి ఆర్దిక స్ధితిగతులను సర్వే చేయడం ద్వారా వారికి రాజ్యాంగ ఫలాలు అందడానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ముందడుగు వేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసిల కులగణన, ఆర్దిక సర్వేను చేపట్టి, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి అట్టడుగు వర్గాల ప్రజలకు చేరే విధంగా పనిచేస్తుందని వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పధకాలను ప్రారంభించిందని ఆయన అన్నారు. నూతనంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పధకాలు ప్రారంభించారని వివరించారు.  ఎకరం పొలం వున్న రైతులకు రైతు భరోసా డబ్బులు  వారి బ్యాంకు ఖాతాలలో జమ‌ అయినాయని చెప్పారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి పాలన చేతకాదని విమర్శలు చేయడాన్ని రమేష్ రెడ్డి తప్పుపట్టారు. బీ ఆర్ఎస్ వారి పాలనలో నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయినారని  ధ్వజమెత్తారు. ఏనాడు సచివాలయానికి నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ వఛ్చిన దాఖలాలు లేవని అన్నారు. కెసిఆర్ ఏనాడు అధికారులతో గాని మంత్రులతో గాని సమీక్ష చేయలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కి 135 ఏళ్ల చరిత్ర వుందని, జగదీష్ రెడ్డి తండ్రి కి, తాతకు కాంగ్రెస్ పాలన తెలుసని అన్నారు. దేశంలో సంస్కరణలు తీసుకుని వచ్చింది ఇందిరాగాంధీ అని, శాస్త్ర సాంకేతిక  రంగాలలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అని, దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర కాంగ్రెస్ నాయకులని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షఫీ ఉల్లా, ముదిరెడ్డి రమణారెడ్డి, వెలుగు వెంకన్న, వల్దాస్ దేవేందర్,  పిల్లల రమేష్ నాయుడు, నరేడ్ల సోమయ్య, ఉపేందర్, కరుణాకర్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333