తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి

Sep 20, 2025 - 21:10
 0  9
తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి

తెలంగాణ పుడమి ఒడిలో పురుడుపోసుకున్న పూలను పూజించే పండగే బతుకమ్మపండగ. ఈ పండగ ఆడబిడ్డల ఆత్మ గౌరవం, ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీక. ప్రకృతితో మమేకమై జరుగుపుకునే బతుకమ్మ పండగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడుతూ పాడుతూ ఘనంగా జరుపుకుంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామం ఈ సమయంలో కోలాహలంగా కనిపిస్తుంది. 21వ తేదీ నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పండగ విశిష్టతను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బతుకమ్మ పండగను ఆశ్వయుజ మాస శుద్ధ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ముఖ్యంగా గునుగు , చామంతి, తంగేడు, ఎర్ర గన్నేరు, బంతి పూలను బతుకమ్మ తయారు చేయడంలో వాడతారు. బతుకమ్మ తయారు చేయడానికి గుమ్మడి ఆకులను పళ్లెంలో వేసి వాటిపై అందంగా పూలను పేరుస్తారు. చివరగా.. మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు. గౌరమ్మను దేవతగా భావిస్తారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333