తాటి చెట్టు పైనుండి కాలుజారి కింద పడ్డ వ్యక్తికి గాయాలు
అడ్డగూడూరు 6ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన రాచకొండ రవి ఆదివారం సాయంత్రం తన కులవృత్తిలో భాగంగా కళ్ళు తీసేందుకు రోజువారి మాదిరిగా తాటి చెట్టుపైకి ఎక్కి ప్రమాదవశాత్తు కాలు జారిపడి గాయాలు అయ్యాయి గాయపడిన రవిని వెంటనే కుటుంబ సభ్యులు మోత్కూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనతో కుటుంబం ఆందోళనకు గురయ్యారు.బాధితుడికి ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.