తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు

Dec 13, 2024 - 20:36
Dec 14, 2024 - 12:23
 0  3
తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు. ఆత్మకూర్ ఎస్ ఇటీవల తండ్రి మృతి చెందడంతో ఆయన జ్ఞాపకార్థం 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉదయం సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు కు ముందుకు వచ్చారు మండల కేంద్రానికి చెందిన పృథ్వీధర్ రెడ్డి. మండల కేంద్రానికి చెందిన తంగేళ్ల సంజీవరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు కాగా ఆయన జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పృధ్విధర్ రెడ్డి విద్యార్థులు ఉదయం సాయంత్రం స్నాక్స్ ఏర్పాటుకు శుక్రవారం పాఠశాల ఉపాధ్యాయులకు 5000 రూపాయలను అందించారు సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్, పెన్షనర్స్ సంఘం నాయకులు తంగళ్ళ లక్ష్మీకాంతరెడ్డి జలగం మల్లేష్ పందిరి మాధవరెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు