TSRTC ప్రవేట్ డ్రైవర్ల నిర్లక్ష్యానికి బలైన కాంట్రాక్టు విద్యుత్తు ఉద్యోగి కృష్ణ మరణం

జోగులాంబ గద్వాల 13 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల అయిజ మార్గంలో టిఎస్ఆర్టిసి ప్రైవేట్ బస్సుల డ్రైవర్ల నిర్లక్ష్యానికి రోజురోజుకీ మరణిస్తున్న వాహనదారులు పట్టించుకోని ఉన్నత అధికారులు ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్ల నిర్లక్ష్యానికి మొన్న మల్ధకల్ దగ్గర నేడు ఐజ పట్టణం నడిబొడ్డున మరణించిన వాహనదారులుఇప్పటికైనా కళ్ళు తెరిచి టి ఎస్ ఆర్ టి సి గద్వాల ఐజ రోడ్ల నడిచే బస్సు డ్రైవర్లకు సరైన శిక్షణ ఉందా లేదా ఎన్ని సంవత్సరాల సర్వీసు ఆ ఫీల్డ్ లో ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉన్నది...నిర్లక్ష్యంగా రోడ్లపై మొన్న తాటికుంట దగ్గర అర్ధరాత్రి ఒక మహిళను వదిలి వెళ్లిన సంఘటన ఇలా చాలా చోట్ల జరుగుతున్న చెప్పుకోలేని కొంతమంది వాహనదారులు రోజు రోజుకి అభివృద్ధిచెందుతున్న పట్టణాలలో అయిజ పట్టణం ఒకటి, అయితే జనాభా తగ్గట్టు విస్తరణ కూడా పెరుగుతున్న నేపథ్యంలో టిఎస్ఆర్టిసి వారు గద్వాల ఐజ మార్గంలో బస్ సర్వీసులు నడుపుతున్న ఒక ప్రభుత్వ ఆర్టీసీ బస్సు కూడా లేకపోవడం చాలా బాధాకరం.. ప్రైవేట్ బస్సులపరమైన గద్వాల అయిజ రూట్ ఆదాయానికి ఆలోచన చేస్తున్న TSRTC, ప్రవేట్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యానికి బలైపోతున్న ప్రాణాలుతూతూ మంత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్న అధికారులుఈరోజు చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగి కృష్ణన్న కుటుంబానికి 25 లక్షల రూపాయలు టి ఎస్ ఆర్ టి సి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం..
మీ శ్రేయోభిలాషి
మాల మల్లికార్జున
BRSV జిల్లా అధ్యక్షుడు
అయిజ
జోగులాంబ గద్వాల్ జిల్లా