డ్వాక్రా డబ్బుల లెక్క తేల్చండి సార్లు
నిందలు వేసి తప్పుడు లెక్కలు చూపుతున్నారంటున్న మాజీ వి ఓ :జలగం వెంకటరమణ
చర్ల, సెప్టెంబర్ 26, తెలంగాణ వార్త ప్రతినిధి : తప్పు ఎవరిదో తేల్చి సభ్యులకు స్త్రీ నిధి డబ్బులు మంజూరు చేపించండి అంటున్న వి ఓ అధ్యక్షురాలు పి. లలిత చర్ల మండల కేంద్రం లోని విజయ కాలనీ నందు ఏ పి డి రంగారావు ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు అందరూ కలిసి గత వి ఓ జలగం.వెంకటరమణ పై డబ్బులు గురించి వచ్చిన ఆరోపణలుపై చర్చించడం జరిగింది.వెంకటరమణ రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు వాడుకున్నారని తిరిగి ఆ డబ్బులు చెల్లిస్తేనే మిగతా గ్రూప్ సభ్యులకు స్త్రీ నిది డబ్బులు మంజూరు అవుతాయని తెలిపారు.ఆ విషయం పై వెంకటరమణ అసలు నేను ఎటువంటి డబ్బులు వాడుకోలేదని బ్యాంక్ నుండి తెచ్చిన స్టేట్మెంట్ చూపిస్తూ కన్నీరు పెట్టుకున్నారు.నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను వి ఓ గా తొలగించారని, జీతం డబ్బులు తొంబై మూడు వేల రూపాయలు ఇవ్వాలని,ఐదు సంవత్సరాలనుండి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.అన్నీ ఆధారాలు ఉన్నా ఇవి పట్టించుకోకుండా వాళ్ళు చెప్పినట్టు డబ్బులు ఇవ్వాలని అధికారులు అంటున్నారని ఆరోపించారు.ఈ సమస్య పరిష్కారం గురించి ఏ పి డి రంగారావు మాట్లాడుతూ ఆడిట్ చేసి లెక్కలు చేసిన తరువాత ఆ బాకీ తెల్చామని వెంకటరమణ కూడా డబ్బులు కడతానని ఒప్పుకుని సంతకం చేశారని కానీ ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉన్న లక్షా అరవై ఆరు వేల రూపాయలు గ్రూప్ సభ్యులు బ్యాంక్ లో జమ చేశారని ఆ డబ్బులు తీసేసి మిగతా డబ్బులు కడతాను అంటున్నారని అవి బ్యాంక్ లో అడ్జెస్ట్ చేసిన డబ్బులు అని అవి తీసేస్తే ఎలా అని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అన్నీ లెక్కలు చేసి ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఏ పి డి రంగారావు,ఏ పి ఎం దేవమని, సి సి ప్రభాకర్, సి బి ఓ ఆడిటర్ భద్రం, సి సి లు భవాని, వెంకటేశ్వర్లు, ప్రసాద్, అకౌంటెంట్ మల్లయ్య,వి ఓ అధ్యక్షురాలు పి. లలిత, కోశాధికారి మల్లేశ్వరి మరియు గ్రూప్ ల సభ్యులు పాల్గొన్నారు.