పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా.కడవెండి వేణుగోపాల్ కుమారుడు వివాహం 

Mar 6, 2025 - 22:16
Mar 6, 2025 - 22:28
 0  6
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా.కడవెండి వేణుగోపాల్ కుమారుడు వివాహం 
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా.కడవెండి వేణుగోపాల్ కుమారుడు వివాహం 

 వివాహ వేడుకలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నివారించడంతో ప్రముఖులతో ప్రశంసలు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు డా.కడవెండి 

ఖమ్మం 06 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-: డా.కడివెండి వేణుగోపాల్ కుమారుని వివాహం దేశ వ్యాప్తంగా పలువురు గౌరవనీయుల నుంచి శుభాకాంక్షలు అందుకుందని , గౌరవనీయ గవర్నర్లు , ముఖ్యమంత్రులు వారి కుటుంబానికి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారని , ఈ వివాహాన్ని డా. కడవెండి వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా నిర్వహించడం జరిగిందని ,  పాటు , ప్రతి అతిథికి మొక్కలను అందజేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఒక ఉదాహరణగా నిలిచారని , పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన విశేష సేవలకు అనేక అవార్డులు లభించాయి అని ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ డా.కడవెండి వేణుగోపాల్ కుటుంబానికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారని , డా. కడవెండి వేణుగోపాల్ కుమారుడు శ్రీ చక్రదర్ , చి.ల.సౌ. హసికల వివాహ మహోత్సవం 2025 మార్చి 2న హైదరాబాదులో, మార్చి 4న ఖమ్మంలో జరిగిన సందర్భంగా గౌరవ గవర్నర్ తమ శుభాకాంక్షలను తెలిపారని , ఆయన తన అభినందనల పత్రంలో వివాహ ఆహ్వానాన్ని అందుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు . అయితే అనివార్య కారణాల వల్ల హాజరుకాలేనందుకు విచారం వ్యక్తం చేస్తూ , నూతన వధూవరులకు సౌఖ్యమైన , ఆనందభరిత దాంపత్య జీవితం సాగాలని ఆకాంక్షించారు . అలాగే వారికి దైవ ఆశీర్వాదాలు లభించాలనీ కోరారు . పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా. కడవెండి వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలక పాత్ర పోషించారని వారి కుమారుని వివాహ మహోత్సవం అతి వైభవంగా , పలువరు ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడిందని , ఒడిశా గౌరవనీయ గవర్నర్ శ్రీ హరి బాబు కంభంపాటి  కూడా ఈ శుభావసరాన్ని పురస్కరించుకుని డా. కడవెండి వేణుగోపాల్ కుటుంబానికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారని , మార్చి 2 , 2025న హైదరాబాదులో జరిగిన వివాహానికి తమ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ , వధూవరులకు ఆనందభరిత జీవితం లభించాలని ఆశీర్వదించారని అన్నారు , ఐ ఇ మిజోరం గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ లాల్దుహోమా  డా. కడవెండి వేణుగోపాల్ కుటుంబానికి , వారి కుమారుని వివాహానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారని , ఈ శుభ సందర్భంలో వారు వదూవరులకు కలకాలం శుభసంపదలు , ఆనంద జీవితం లభించాలని ఆకాంక్షించారు . అంతేకాకుండా డా. వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణలో చేసిన విశేష కృషిని కొనియాడుతూ , వారి పట్టుదల , కృషిని అభినందించారని .  నాగాలాండ్ గౌరవనీయ గవర్నర్ శ్రీ లా. గణేశన్ కూడా డా. కడవెండి వేణుగోపాల్ కుటుంబానికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారని , ఈ వివాహం సందర్భంగా వారు వధూవరులకు ప్రేమ , సంతోషాలతో నిండిన దాంపత్య జీవితం లభించాలని ఆశీర్వదించారని , ఐబీ గుజరాత్ గౌరవనీయ ముఖ్యమంత్రి డా. కడవెండి వేణుగోపాల్ కుమారుని వివాహానికి శుభాకాంక్షలు తెలియజేశారని ఈ శుభ సందర్భంలో వదూవరులు ఆనందభరిత జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారని , ఈ సందర్భంగా డా. కడవెండి వేణుగోపాల్ కుటుంబ సభ్యులు వివాహ శుభాకాంక్షలు పంపిన గౌరవనీయులందరికీ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  తెలిపారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333