డోర్ టు డోర్ ఓటరు జాబితా సవరణ తప్పనిసరి తహసిల్దార్

Oct 27, 2025 - 13:42
 0  2
డోర్ టు డోర్ ఓటరు జాబితా సవరణ తప్పనిసరి తహసిల్దార్

  తిరుమలగిరి 27 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

2002 మరియు 2025 వరకు ఓటరు జాబితా సవరణ కార్యక్రమం తిరుమలగిరి తహసిల్దార్ కార్యాలయంలోని సూపర్వైజర్స్ అంగన్వాడి టీచర్స్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ హరిప్రసాద్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఇంటింటికిి వెళ్లి ఓటర్లకు ప్రతిదీ వివరించి, ఓటరు జాబితాలో చేర్పులు, తొలగింపులు మరియు సవరణలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి అర్హత గల పౌరుడు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావాలని, డూప్లికేట్ లేదా బోగస్ పేర్లు లేకుండా ఓటరు జాబితా శుద్ధి చేయాలని నిర్ణయించారు మరియు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సదుపాయాలను వినియోగించుకోవాలని తెలిపారు.18 ఏళ్లు నిండిన యువత, మహిళలు , వెనుకబడిన వర్గాలు ఓటరు జాబితాలో తప్పక నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.సమగ్ర, పారదర్శక , తప్పులులేని ఓటరు జాబితా సిద్ధం కావడానికి ఓటర్లు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో జాన్ మొహమ్మద్ మున్సిపల్ ఆఫీసర్ శోభకుమారి, అనిత, సుభద్ర వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్స్ మున్సిపాలిటీ అధికారులు సూపర్వైజర్స్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి