బస్సు ప్రమాదం ....వస్త కొండూర్ చేరుకున్న మృతదేహం

Oct 27, 2025 - 14:22
 0  0
బస్సు ప్రమాదం ....వస్త కొండూర్ చేరుకున్న మృతదేహం

  గుండాల 27 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

కర్నూలు జిల్లా లోని కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వేమూరి కావేరి సంస్థకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తన స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తా కొండూరు గ్రామానికి చెందిన మహేశ్వరం అనుష రెడ్డి డిఎన్ఏ పరీక్షలు అనంతరం అధికారులు అనూష మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈరోజు గ్రామానికి చేరుకున్న అనూష మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు దీంతో వస్తా కొండూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి