డంపింగ్ యార్డ్ కు ప్రహరి గోడ నిర్మించాలి
అధ్వాన్నంగా తయారైన మున్సిపాలిటీ చెత్త డంపు యార్డ్...
అవస్థలు పడుతున్న ప్రజానీకం రైతులు.
సంక్షేమ హాస్టల్స్ కు అతి దగ్గరలో డంపు యార్డ్.
ప్రహరీ గోడ లేక ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి
తిరుమలగిరి 09 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డు చెట్టు వెంటనే ప్రహార నిర్మించాలని సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య డిమాండ్ చేశారు గురువారం ఆయన డంపింగ్ యార్డ్ ను పరిశీలించి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రహరీ లేకపోవడంతో వ్యర్దల నుంచి వెలువడే పొగ వల్ల రైతులు దాదాపు 20 నుండి 50 ఎకరాల పాటు నష్టపోతురని అలాగే నీలిబండ తండా కు వెళ్లే వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు స్పందించి ప్రహరీ నిర్వహించడంతోపాటు అక్కడ రీసైక్లింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు...