ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు క్విజ్ పోటీలు
సూర్యాపేట. 24 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- రోడ్డు భద్రత మాసోత్సవల్లో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో ఎంఏఎం పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ లైటు వెలిగితే దేనికి సంకేతం? జీబ్రాలైన్ యొక్క ఉద్దేశం ఏమిటి ? ట్రాఫిక్ లో రెడ్, ఎల్లో లైట్ దేనినీ సూచిస్తుంది? పలు అంశాలపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థుల ఉత్సాహం పట్ల ట్రాఫిక్ ఎస్ఐ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుండా తమ చుట్టూ ఉన్న వారిని కూడా అలా ప్రోత్సహించాలని సూచించారు. 18 ఏళ్ల లోపు విద్యార్థులు డ్రైవింగ్కు దూరంగా ఉండాలని ఉద్ఘటించారు. మొత్తం 200 మంది విద్యార్థుల్లో 40 మంది విద్యార్థులు క్విజ్ పోటీలో పాల్గొన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రిన్సిపల్ ఏకయ్యతో కలిసి ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అందజేశారు. కార్యక్రమమంలో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.