ధాన్యం తనిఖీ చెక్ పోస్ట్ ప్రారంభం

Oct 30, 2025 - 11:48
Oct 30, 2025 - 16:39
 0  19
ధాన్యం తనిఖీ  చెక్ పోస్ట్ ప్రారంభం

తెలంగాణ వార్త:- వాజేడు మండలం చెరుకూరు అంతర్ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి ప్రారంభించారు. ములుగు జిల్లాకు అనుకొనిరాష్ట్రం ఉన్న చత్తీస్గడ్ రాష్ట్రం నుండి వరి ధాన్యం మన జిల్లాలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దళారులు తెచ్చి మద్దతు ధర బోనస్ పొందకుండా మన రాష్ట్ర రైతులకు మాత్రమే లాభం చేకూరాలని అట్టి రాష్ట్రము నుండి వచ్చే ధాన్యం లారీ లను జప్తు చేసి అట్టి దళారులపై చర్య తీసుకోవడం కోసం ఇట్టి తనిఖీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బి. రాంపతి జిల్లా మేనేజర్ పౌర సరఫరా, షా ఫైజల్ హుస్సేనీ జిల్లా పౌరసరఫరా అధికారి, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, పాల్గొన్నారు. తదితరులు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్