టీయూడబ్ల్యూజే( ఐజేయు ) తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం..
దామెర రవి
మునగాల 21 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల విషయంలో టీయూడబ్ల్యుజే (ఐజేయూ) కీలక పాత్ర పోషిస్తుందని మునగాల మండల టీయూడబ్ల్యుజే (ఐజేయూ) మండల కార్యద్శి దామెర రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర తృతీయ మహాసభలకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి త్వరలోనే కొత్త పాలసీని తీసుకు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి కృషితో జర్నలిస్ట్ ల అక్రైడేషన్ కార్డులు మరో మూడు నెలలు పొడిగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ సమస్యలకై నిరంతరం పోరాటం చేస్తున్న టియుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ కి కృత్ఞతలు తెలిపారు. నిత్యం జర్నిస్టుల సమస్యలకు పోరాటం చేస్తున్న టియుడబ్ల్యూజే (ఐజెయు) లో చేరి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారం అవుతుందని అన్నారు.