రోడ్లపై రాస్తారోకోలు చేస్తున్న రైతులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ నీళ్లoధించుట లో అధికారులు విఫలం గోదారి నీళ్ళందక ఎండుతున్న వరి పొలాలు. రైతుల మధ్య చిచ్చులు పెడుతున్న ఇరిగేషన్ అధికారులు.. రోడ్డు పై రాస్తారోకో చేసిన పెన్ పహాడ్ రైతులు. ఆత్మకూర్ ఎస్.. వరి పంటల సాగు కోసం వార బంది ప్రకారం నీళ్లు అందిస్తామని ముందుగా చెప్పిన పాలకులు నిల్లు ఇవ్వడంలో విఫలమయ్యారు. వారం రోజులు వచ్చే నీళ్లలో పంపకాల్లో రైతుల మధ్య అధికారులు వివాదాలు పెడుతున్నారు. ప్రతివారం నీటి కోసం రోడ్డుపై అందోళనకు దినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆత్మకూరు మండలం కోటి నాయక్ తండ వద్ద ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ డి బి ఎం 71 కాల్వకు నీళ్లు అందించాల్సిన అధికారులు నీళ్లు విడుదల చేసి నాలుగు రోజులు గడుస్తున్నా పెన్పాడు మండలానికి నీళ్లు రాకపోవడంతో వరి పొలాలు ఎండుతున్నాయని గురువారం సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారికోటి నాయక్ తండ srsp కాల్వ బ్రిడ్జి పై ఆందోళనకు దిగారు. వార బంది ప్రకారం ఈ నెల 16న గోదావరి జిల్లాలు విడుదల చేసిన అధికారులు ప్రధాన కాలువకు నీల్లు అందించకుండా 36ఎల్ కాల్వ ద్వారా మోతే మండలానికి మాత్రమే నీళ్లు తరలించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. అధికారులు నీటి సరఫరా ఇవ్వడంలో పక్షపాతం ఇస్తున్నారు అంటూ నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని విడుదల చేసిన అధికారులు గేట్ల వద్ద సిబ్బందిని రక్షణ కోసం ఏర్పాటు చేయక పోవడం తో రాత్రి వేళల్లో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు మెయిన్ కాలువ గేట్లు ముసివేసి నీళ్లు మల్లిస్తున్నారంటూ ఆరోపించారు. గత 10రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా ప్రదాన కాల్వ గేట్ల కు వెల్డింగ్ లు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు.ఇరిగేషన్ ఏ ఏఈ డౌన్ డౌన్ ఆంటూ నినాదాలు చేశారు.సుమారు గంట వరకు రోడ్డు పై ఆందోళన చేయడం తో వాహనాలు కిలోమీటరు మేర స్తంభించాయి. ఇరిగేలేషన్ డీ ఈ రమేష్ తమ సిబ్బందితో వచ్చి మీ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడం తో ఆందోళన లభించారు. అనంతరం ప్రధాన కాలువకు మూసివేసిన గేట్లనుక్రేన్ ద్వారా తీయడం తో మెయిన్ కెనాల్ నుండి నీటి సరఫరా ప్రారంభమైంది. ప్రతిసారి నీటి సరఫరాలో రైతుల మధ్య వివాదాలు పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు డిమాండ్ చేశారు.