వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవీటి గురుమూర్తి జన్మదిన వేడుకలు

Jun 21, 2024 - 15:09
Jun 21, 2024 - 15:10
 0  2
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవీటి గురుమూర్తి జన్మదిన వేడుకలు

మునగాల 21 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవేటి జన్మదిన సందర్బంగా మునగాల మండల గణపవరం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఫర్నిచర్ ( ఆఫీస్ టేబుల్ , చైర్ ) మరియు విద్యార్థులకు నోట్ పుస్తకాలు , స్టేషనరీ అందించి మిఠాయిలు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు  మాట్లాడుతూ వాసవి క్లబ్ వారి సేవలు మరువలేవని తెలియజేశారు అదేవిధంగా గ్రామ పెద్దలు కొండపల్లి నరసింహరావు శుభాకాంక్షలు తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరం అని అన్నారు , విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి గ్రామానికి , తల్లి తండ్రులకు పేరు తెచ్చుకోవాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవేటి వెంకట గురుమూర్తి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వాసవి క్లబ్ అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్ వాసవి క్లబ్ వంగవవేటి వెంకట గురుమూర్తి , వాసవి క్లబ్ జిల్లా పి వి డి ప్రసాద్ జిల్లా వాసవి క్లబ్ జిగిని ప్రసాద్ , zc బెలిదీభరత్ , షేక్ రమేష్ ,చిల్లంచర్ల శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులు తల్లాడ ఉపేందర్ అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State