టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

జోగులాంబ గద్వాల 6 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. ఈరోజు అనగా 6/6/2025 న రామ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ కార్యక్రమం ప్రారంభించడమైనది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టీబీ లక్షణాలతో బాధపడుతున్న వాళ్లను, ఐరిస్క్ పాపులేషన్ ను, అందులో షుగర్ వాలను బిపి ఉన్న వాళ్లను, 60 సంవత్సరాల పైబడిన వాళ్లను,టిబి ఉన్న వాళ్లను మరియు గతంలో టిబి ఉన్న వ్యక్తులను మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను అందరికీ టీబీ టెస్టులను చేయించడం అవుతుంది ఈరోజు 12 మంది ఎక్స్రే రే మరియు 30 మందికి గళ్ళ పరీక్ష చేయించడం అయినది ఈ కార్యక్రమము జిల్లా మొత్తము జరుగుతుంది ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు మరియు డాక్టర్ మాధుర్య డాక్టరు ప్రియాంక, డిప్యూటీ. డెమో మధుసూదన్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.