గంజాయి తరలిస్తున్న ఇద్దరి పై కేసు నమోదు

Mar 24, 2025 - 20:29
Mar 24, 2025 - 20:32
 0  3
గంజాయి తరలిస్తున్న ఇద్దరి పై కేసు నమోదు

సూర్యాపేట, 23 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఈరోజు అనగా తేదీ 24.03.2025 రోజున ఉదయం సమయమున పై అధికారుల ఉత్తర్వుల మేరకు SI E. సైదులుగారు హెడ్ కానిస్టేబుల్స్ కరుణాకర్, కృష్ణయ్య, వీరయ్య, కానిస్టేబుల్ శివ, నవీన్ లు కలిసి సూర్యాపేట పట్టణములోని ఖమ్మం X రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఉదయం సుమారు 10 గంటల సమయమున సూర్యాపేట పట్టణానికి చెందిన దాసరి సిద్దార్థ, మహ్మద్ ఉమర్ లు కలిసి ఉమర్ యొక్క స్ప్లెండర్ ప్లస్ బైక్ పై 1 కేజీ 200 గ్రాముల గంజాయిని తీసుకొని కోదాడ నుండి సూర్యాపేట వస్తు పోలీసువారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా వారిని పట్టుబడి చేసి, వారివద్ద ఉన్న 1 కేజీ 200 గ్రాముల గంజాయిని, వారి మోటారు సైకిల్ ను స్వాధీనపరచుకొని, వారిని SI M. ఆంజనేయులుగారు జైల్ కు తరలించనైనది..... ఇట్లు P.వీర రాఘవులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, సూర్యాపేట పట్టణ పోలీసుస్టేషన్ ..........ఎవరైనా మాధక ద్రవ్యములు కలిగి ఉన్న, సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పోలీసువారు తెలియపరచనైనది.....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333