జూలై 3న గరికపాటి నర్సింహ రావు ఆధ్యాత్మిక ప్రవచనం

Jun 29, 2024 - 19:26
 0  10
జూలై 3న గరికపాటి నర్సింహ రావు ఆధ్యాత్మిక ప్రవచనం

జులై 3 బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి మహల్ లో ఆధ్యాత్మిక ప్రవచకులు మహా సహస్రవదాని, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు చే కర్మ సిద్ధాంతంపై  భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనము బోధించనున్నట్లు కార్య క్రమ నిర్వాహకులు బొమ్మిడి అశోక్ తెలిపారు. శనివారము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని రవి మహల్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తన ఆధ్యాత్మిక బోధనలతో ఎంతోమందినీ ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించి తన వాగ్వైభవంతో నవ్వులను పండించడమే కాకుండా, ఆలోచనలను‌ రగిలించే సంస్కరణ రణ పండితుడు, మహా సహస్రావధాని, ప్రవచన కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి  గరికపాటి నరసింహారావు అన్నారు. జూలై 3 బుదవారం శనివారం  సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు జరుగు ఈ ఆధ్యాత్మిక ప్రవచన  కార్యక్రమానికి  ఆధ్యాత్మిక వేత్తలు, పట్టణ ప్రముఖులు, సాహిత్య అభిలాషులు  పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ ప్రవచన కార్యక్రమము    సాయంత్రం 5 గంటల కు ప్రారంభము  అవుతున్న0దున  సమయ పాలన పాటి0చి  ఆధ్యాత్మిక సభ ప్రాంగణం  కు చేరుకోవాలని తెలిపారు.

    ఈ కార్యక్రమానికి   సన్నిధి అరణ్య డెవలపర్స్, వి కేర్ హాస్పిటల్, గ్లోబల్ కంటి ఆసుపత్రులతో పాటు ఫంక్షన్ హాల్ ఉచితంగా అందజేసిన  రవి మహల్ యజమాని   కర్నాటి రవి కుమార్ కు ధన్యవాదములు  తెలిపారు. ఈ సమావేశంలో  తూముల ప్రవీణ్, నూకల శైలేందర్, బొడ్డు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333