జూలై 10 కార్మికుల కోరికల దినోత్సవం విజయవంతం చేయాలి

Jun 27, 2024 - 19:00
Jun 27, 2024 - 19:19
 0  11
జూలై 10 కార్మికుల కోరికల దినోత్సవం విజయవంతం చేయాలి

మండల జిల్లా కేంద్రాల్లో పారిశ్రామిక వాడల్లో ధర్నాలు కార్మికులందరూ పాల్గొనాలి

 సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది పిలుపు ---

పెన్ పహాడ్. 27 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికులందరూ ఏకం కావాలి ఈరోజు నేరేడుచర్ల మండల కేంద్రంలోని ఆ రి బండి భవన్ లో హుజూర్నగర్ నియోజకవర్గ సిఐటియు జిల్లా నాయకుల సమావేశం కందగట్ల అనంత ప్రకాష్ అధ్యక్షతన జరిగినది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిఐటియు అఖిలభారత కమిటీ పిలుపుమేరకు జూలై 10న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ పారిశ్రామిక కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ఈ ధర్నాలో కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

కేంద్రంలో మూడోసారి అధికారులు వచ్చిన బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడలు బొగ్గు బ్లాకుల వేలం వేలం ప్రక్రియను వేగవంతం చేసిందని ఆయన అన్నారు కార్పొరేట్ మతోన్మాదులను ప్రసన్నం చేసుకోవడానికి వారికి లాభాలు కట్టబెట్టడానికి కృత నిశ్చయంతో ఉన్నదని ఆయన విమర్శించారు కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్న వేళ కార్మిక హక్కులను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు అందులో భాగంగా జులై 10న జరిగే కార్మికుల కోర్కెల దినం ను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశం కందగట్ల అనంత ప్రకాష్ అధ్యక్షతన జరగగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను ఎలుక సోమయ్య గౌడ్ జిల్లా నాయకులు షేక్ యాకూబ్ వరలక్ష్మి వ్రత సైదులు నీల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State