అలంపూర్ కి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ
జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్ .తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ,పర్యావరణ,అటవుల సంరక్షణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రా లు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
ఉదయం అలంపూర్ కు చేరుకున్న మంత్రి కి సంపత్ కుమార్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ గజమాలతో మంత్రి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం
శ్రీశ్రీశ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి దేవాలయ పురోహితులు మంత్రి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు జోగులాంబ అమ్మవారి దర్శనం, అనంతరం ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA.సంపత్ కుమార్ తో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది..అనంతరం అక్కడ జరిగే హోమం పూర్ణాహుతి కార్యక్రమం లో పాల్గొన్నారు.
అనంతరం పక్కనే ఉన్న ప్రసాద్ స్కీం సందర్శించి భవనం యొక్క అభివృద్ధికి సంబంధించి డాక్టర్ ఎస్ ఎ సంపత్ కుమార్ చొరవ మేరకు తగిన నిర్ణయాలు తీసుకుంటామని త్వరలోనే రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా పేరొందిన శ్రీ అలంపూర్ జోగులాంబ క్షేత్రాన్ని తిరుమల తిరుపతి క్షేత్రం అంత గొప్పగా తీర్చి దిద్దుతానని మంత్రి తెలియజేశారు
ఈ కార్యక్రమం లో దేవాలయ కమిటీ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి ,మరియు ధర్మ కర్తలు ,దేవాలయ EO పురందేశ్వర్ మరియు జిల్లా కలెక్టర్ ,మరియు ఎస్పీ ,IFS అధికారులు ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.