జానమ్మ ఏఎన్ఎం కు పదవి విరమణ వీడ్కోలు
ఘనంగా జానమ్మ ఏ యన్ ఎం పదవి విరమణ వీడ్కోలు
కరోన కష్ట కాలం లో గ్రామ ప్రజలకు చేసిన వైద్య సేవలు అభినందనీయం
పెన్ పహాడ్ జడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య* *ఎంపీడీఓ వెంకటేశ్వర రావు
పెన్ పహాడ్. 27 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతరం గ్రామంలో ఏఎన్ఎం గా విధి నిర్వహణ లో అందరి మన్ననలు అందుకొని పదవి విరమణ పొందిన అనంతారం సబ్ సెంటర్ లో ఏ యన్ ఎం గా విధులు నిర్వహిస్తు పదవి విరమణ పొందిన జానమ్మ ను గురువారం మండల పరిధిలోని అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శాలువలు పూలమాలలతో ఘనంగా సత్కరించి పట్టు చీరె అందజేశారు జడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణ లో భాగంగా కరోన కష్ట కాలంలో సొంత ఆరోగ్య లను సొంత కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు జానమ్మ దాదాపు 30 సంవత్సరాలు వైద్య సేవలు అందించారు అని అన్నారు
వారి అనుభవం సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతగా నిలుస్తాయని తెలిపారు పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ డాక్టర్ స్రవంతి .సూపర్ ఇండెంట్ చంద్రశేఖర్ .ఎంపీటీసీ మామిడి రేవతి .పంచాయతీ కార్యదర్శి రాజేష్.మంగమ్మ.వెంకటరమణ.ఆశ.సబితా శ్రీలక్ష్మి. జానీ భేగం తదితరులు పాల్గొన్నారు