రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి.
రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి:-
సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలి సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు
హైడ్రాతో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైడ్రా వల్ల రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం చిన్నాభిన్నమైందని చెప్పారు. గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి నెంబర్లు ఉన్నటువంటి ఇండ్లకు రిజిస్ట్రేషన్లు చేయడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి రిజిస్ట్రేషన్ చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిత్యం కార్యాలయ పనుల నిమిత్తం వచ్చేటువంటి ప్రజలకు మంచినీటి వసతి, కూర్చోవడానికి కుర్చీలు లేని పరిస్థితి ఉందన్నారు. వెంటనే స్పందించి ప్రభుత్వం నూతన బిల్డింగును నిర్మించడంతోపాటు మౌలిక వసతులు కల్పించి అందుబాటులోకి తేవాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్, ఇండస్ట్రియల్ పార్క్ పునరుద్ధరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దినదినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేట లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ కార్యదర్శి అయితగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్ మందాడి గోవర్ధన్ గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు