సీజ్ చేసిన ఇసుకను కాజేసిన్రు
పట్టపగలే అక్రమ ఇసుక రవాణా....
సీజ్ చేసిన ఇసుకను కాజేసిన ఇసుక దొంగలు....
స్థానిక ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తున్న అధికారులు....
తిరుమలగిరి 26 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామంలో జోరుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. వర్షం సైతం లెక్కచేయకుండా వ్యవసాయ రైతు ఎడ్ల బండ్లు,ఆటోలు,ట్రాక్టర్ల తో కాకుండా లారీలు మరియు జెసిబిల సహాయంతో ఇసుక రవాణా చేస్తున్నారు.కూతవేటుదూరంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న కళ్ళు ఉన్న గుడ్డివాళ్లలా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనంతారం గ్రామ శివారులోని సిఫై ఇన్ఫ్రా కంపెనీ వారు గత ప్రభుత్వ హయంలో చెక్ డ్యాం నిర్మాణం కోసం దాదాపు 250 ట్రిప్పుల ఇసుకను డంపు చేశారు. ఆ ఇసుకను గుర్తుతెలియని కొంతమంది అక్రమ ఇసుక రవాణా చేశారు. దీనిపై పలువురు కౌన్సిలర్లు గతంలో ఆందోళన చేయడంతో రెవిన్యూ అధికారులు ఆ ఇసుక డంపును సీజ్ చేశారు. బుధవారం పట్టపగలే సీజ్ చేసిన ఇసుక డంపులను అక్రమ ఇసుక రవాణా చేసే కొందరు జేసీబీ ల సహాయంతో టిప్పర్ లలో దాదాపు 200 ట్రిప్పుల ఇసుకను కాజేశారు. దీనిపై మున్సిపాలిటీ 10 వ వార్డు కౌన్సిలర్ మొగుళ్ళ జితేందర్ మాట్లాడుతూ గతంలో మేము కొంతమంది గ్రామ ప్రజలు కలిసి ఇసుకను సిజ్ చెప్పిచమని ఇప్పుడు కొందరు గుర్తుతెలియనిి వ్యక్తులు ప్రభుత్వం సీజ్ చేసిన ఇసుకను అక్రమంగా తరలించారని తెలిపారు. అక్రమ రవాణా చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల భారీ ఎత్తున ప్రజలతో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.