జిల్లా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జే సంద్యా కిరణమై
••• జిల్లా ఆస్పత్రి నందు SNCU, Day Care, సెంటర్, జిరియాట్రిక్ వార్డులను పరిశీలన...
RMO డాక్టర్ హేమలత, జిల్లాస్పత్రి చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్.
జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా ఆస్పత్రి నందు ఈరోజు డాక్టర్ హేమలత RMO ఆధ్వర్యంలో.. డిఎంహెచ్ఓ డాక్టర్ జె సoద్యా కిరణమై పలు వార్డులను సందర్శించారు.. "డే కేర్ క్యాన్సర్ సెంటర్" నందు జరిగిన అడ్మిషన్లు జిల్లా నందు ఉన్న క్యాన్సర్ కేసుల వివరాలు ఆసుపత్రి నందు ఉంచుకొని వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా పనిచేస్తున్నారని..MNJ క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిన వారికి ఇక్కడ వైద్యం అందిస్తారని, సరైన మందులు పంపిణీ చేయాలని తెలిపారు... పాలియేటివ్ కేర్ నందు అడ్మిషన్ అయిన పేషెంట్ ను అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు..అదేవిధంగా "జిర్యాట్రిక్ వార్డ్" అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి మరియు గ్రామాల నుండి జిల్లా ఆస్పత్రికి వచ్చిన 60 సంవత్సరముల పైబడిన వారందరికి 20 బెడ్స్ వరకు ప్రత్యేకంగా కేటాయించి వైద్య సేవలు అందించాలి అని కూడా సందర్భంగా తెలిపారు... అనంతరం "స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ " (SNCU)ను చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్లచే సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు నవంబర్ నెలలో 94 కేసులు అడ్మిషన్ అయ్యాయని... తెలుపగా అడ్మిషన్ అయినా ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన చికిత్స అన్ని ఇవ్వాలని మేడం గారు తెలిపారు.. అదేవిధంగా "సంకల్ప్ " ప్రోగ్రాం ని కూడా జిలాస్పత్రి నందు విజయవంతం చేయాలని సూచించారు
•• ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, నర్సింగ్ సూపర్ ఇంటెండెంట్ తిలక మేడం,ఆఫీసర్, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్, డాక్టర్ అశోక్,డాక్టర్ భరత్,డాక్టర్ ప్రదీప్, డాక్టర్ నాగార్జున, డాక్టర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.