జలసిరితో భవిష్యత్ తరాలకు నీటిని అందిద్దాం ఎంపీడీవో
జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల. ఏలీనో ప్రభావం కారణంగా భవిష్యత్తులో నీటి కొరతను అరికట్టుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలసిరికార్యక్రమాన్ని రూపొందించిందని ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ఇటిక్యాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు జలసిరి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జలసిరి కింద రైతులకు పంట కుంట,ఊరికి ఊరకుంట,ఇంటికి ఇంకుడు,గుంత ఉన్నాయని వివిధ గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.