జర్నలిస్ట్ నజీర్ ఖాన్ కి దక్కిన అరుదైన గౌరవం

నజీర్ ఖాన్ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ ప్రధానం చేసిన డాక్టర్ ఆకుల రమేష్
ఈ అవార్డ్ రావడంతో నాకు మరింత బాధ్యత పెరిగింది . . . నజీర్ ఖాన్
సూర్యాపేట
సూర్యాపేట పట్టణ కేంద్రానికి చెందిన నజీర్ ఖాన్ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ ని ఆసియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ , స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ , పీస్ ఆఫ్ ఇండియా ఎన్జీవో , స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో, ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్ టి ఆర్ ఆడిటోరియం నాంపల్లి లో డాక్టర్ లయన్ ఆకుల రమేష్ చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ను వాటికి సంబంధించిన సర్టిఫికెట్ మరియు మెడల్ ని అందజేశారు అని అన్నారు . ఈ సందర్భంగా నజీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడంతో నాకు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని అన్నారు . నేను చేస్తున్న సామాజిక సేవలు , మీడియా సేవలను గుర్తించి నాకు అవార్డును అందించిన డాక్టర్ ఆకుల రమేష్ కి ధన్యవాదములు తెలిపారు. అవార్డ్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు .