జగ్గయ్యపేట మండలంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వినతి పత్రం అందించిన""ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య

Jun 19, 2025 - 16:49
Jun 19, 2025 - 19:27
 0  18
జగ్గయ్యపేట మండలంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వినతి పత్రం అందించిన""ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ళపాడు, అగ్రహారం, అన్నవరం, ధర్మవరప్పాడు తండా, వేదాద్రి, రావిరాల గ్రామాలలో గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామాలలో ప్రాథమికోన్నత పాఠశాలలుగా ఉన్న పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా ప్రతిపాదించడం వలన స్థానిక విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకుగాను ఈరోజు వివిధ గ్రామాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారి నివాసంలో వారిని కలిసి ప్రాథమికోన్నత పాఠశాలలు గానే కొనసాగించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు ఎడ్యుకేషన్ కమిషనర్(రాష్ట్ర అధికారులు) గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.*_

_ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు గింజుపల్లి రమేష్, జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, ధర్మవరపుపాడు తండా గ్రామ సర్పంచ్ గుగులోతు మనీ హుస్సేన్ మరియు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు._

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State