ఘనంగా మేడే ఉత్సవాలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కై పోరాడుదాం. 139 మే డే సందర్భంగా కార్మికులకు పిలుపు- కార్మికులను కట్టు బానిసత్వానికి గురిచేసే లక్ష్యంతో మతోన్మాద ఆర్ఎస్ఎస్-బిజెపి మోడీ-షాల ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా 139వ మేడేను పాత సూర్యాపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఐ ఎఫ్ టి యు సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఐఎఫ్ టి యు జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి పాల్గొని మాట్లాడరూ. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్ టి యు) గ్రామ అధ్యక్షులు చెరుకుపల్లి వీరయ్య ఐఎఫ్ టి యు జెండాను ఎగరవేశారు, మండల అధ్యక్షులు సూరారపు వెంకన్న, గ్రామ ప్రధాన కార్యదర్శి తల కొప్పుల ఎల్లయ్య, వసుకు మంగయ్య, పలసరాజు, ఎడవల్లి నాగేందర్, సైదులు, నెమ్మది ఎల్లయ్య బోల్లెపాక ముత్లింగం తదితరులు పాల్గొన్నారు.