గ్రామ ప్రథమ పౌరులుగా ప్రమాణస్వీకారం

Dec 23, 2025 - 08:56
 0  393
గ్రామ ప్రథమ పౌరులుగా ప్రమాణస్వీకారం

తిరుమలగిరి 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని 16 గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  మండల వ్యాప్తంగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి బండ్లపల్లి సర్పంచ్ బర్ల వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ కోక ప్రభాకర్ చింతలకుంట తండా జాటోత్ రవి ఉప సర్పంచ్ సోడా ప్రవీణ్ గుండె పూరి సర్పంచ్ కొమ్ము సోమన్న ఉప సర్పంచ్ పవన్ కుమార్ జలాల్పురం సర్పంచ్ బెట్టం గణేశ్వరి ఉప సర్పంచ్ కొమ్ము సోమయ్య కన్నా రెడ్డి కుంట తండా సర్పంచ్ లకవత్ భగవాన్ ఉపసర్పంచ్ భుఖ్య నరేష్ కోకియా నాయక్ తండ సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ ఉప సర్పంచ్ గుగులోతు సుధాకర్ కోత్య తండా సర్పంచ్ ధరావత్ రామోజీ ఉపసర్పంచ్ ధరావత్ కిషన్ మామిడాల సర్పంచ్ బొడ్డు సైదులు ఉప సర్పంచ్ వట్టే స్వరూప మర్రికుంట తండా సర్పంచ్ గుగులోతు రోజా ఉప సర్పంచ్ బానోతు సంధ్య మొండి చింత తండ సర్పంచ్ లౌడియా శ్రీలత ఉపసర్పంచ్ జాటోత్ శిరీష రాఘవాపురం సర్పంచ్ ధరావత్ చిరంజీవి ఉప సర్పంచ్ గుగులోతు మంజుల రాజ నాయక్ తండ సర్పంచ్ భూక్య బిచ్చు ఉప సర్పంచ్ మాలోతు మోహన్ సిద్ధి సముద్రం సర్పంచ్ ధరావత్ సుజాత ఉపసర్పంచ్ ధరావత్ బాలు తాటిపాముల సర్పంచ్ బోయినపల్లి కృష్ణయ్య ఉప సర్పంచ్ బోసాని ఎల్లమ్మ తొండ సర్పంచ్ భాష మల్ల స్వాతి ఉప సర్పంచ్ గొలుసుల వెంకన్న వెలిశాల సర్పంచ్ కుంభం మంజుల ఉపసర్పంచ్ ఆలకుంట్ల ఎల్లమ్మ  తో పాటు 16 గ్రామాల వార్డు సభ్యులు అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు సర్పంచ్ అభ్యర్థులు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్ధి దిశగా కృషి చేసి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ.   గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశుభ్రత, సంక్షేమ పథకాల అమలులో నూతన పాలకవర్గం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల స్పెషల్ అధికారులు ఎంపీడీవో లాజర్ కార్యదర్శులు జిపిఓలు మరియు వివిధ పార్టీల కార్యకర్తలు గ్రామ పెద్దలు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి