గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

Nov 28, 2025 - 18:46
 0  24
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

 జోగులాంబ గద్వాల 28 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లను దృష్టిలో ఉంచుకుని, గద్వాల్ మండలంలోని పరుమల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్  కేంద్రo ను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎస్పీ  విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ—

నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగాలి

ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి

ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించడం ప్రతి సిబ్బంది బాధ్యత అని చెప్పారు.

  — ఎలక్షన్ ఉద్దేశించి మాట్లాడుతూ..

“ఎన్నికల్లో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదు. ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అన్నారు.

జిల్లాలో సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా, బందోబస్తు, పేట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, ప్రలోభాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333