తొలివిడత నామినేషన్ల పర్వం షురూ..

Nov 28, 2025 - 05:51
 0  516
తొలివిడత నామినేషన్ల పర్వం షురూ..

  తిరుమలగిరి 28 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో బండ్లపల్లి 01, మామిడాల 03, కోక్య నాయక్ తండ 03, వెలిశాల 02, జలాల్పురం 01, రాఘవపురం 02, గుండెపురి 01 సర్పంచ్ నామినేషన్లు స్వీకరించడం జరిగింది. మండల స్పెషల్ ఆఫీసర్ , ఎంపీడీవో మరియు తహసిల్దార్ పలు కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తునట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఈనెల 30న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి