గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ బొడ్డు సైదులు
తిరుమలగిరి 13 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం మామిడాల గ్రామ అభివృద్ధికై మురికి కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించి, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొడ్డు సైదులు మాట్లాడుతూ. వర్షాకాలం మరియు ఇతర సీజన్లలో అంటువ్యాధులు ప్రబలకుండా కాలువల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా, లీకేజీ ఉన్న నల్ల పైపులకు జాయింట్లు వేసి మరమ్మతులు పూర్తి చేశారు. గ్రామస్తుల రక్షణ కోసం మరియు చీకటి సమస్యను తొలగించడానికి ప్రతి వీధికి కొత్త వీధి దీపాలన అమర్చడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు..