గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

అడ్డగూడూరు 07 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది శుక్రవారంనాడు అడ్డగూడూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది.ఈ సందర్భంగా అడ్డగూడూరు మండల అధ్యక్షుడు బాలెoల మల్లయ్య మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని అదేవిధంగా వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి రెండవ పిఆర్సిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలి,జీవో నెంబర్ 51 సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి!అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ ఆరోగ్య భద్రత కల్పించే విధంగా చొరవ తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది హామీలను నెరవేర్చాలి అంతే కాకుండా గ్రామ సిబ్బంది చనిపోతే వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేయాలి ప్రతి ఒక్క గ్రామ సిబ్బందికి 5లక్షల వరకు ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. కార్యాలయ ముట్టడి భాగంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎంపీడీవోకి ఎంపీఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి మన అడ్డగూడూరు మండల అధ్యక్షులు బాలెంల మల్లయ్య
నాగులపల్లి బీరప్ప మందుల మల్లేష్ మందులు అంజయ్య యాదగిరి అవిలయ్య సోమయ్య స్వామి వివిధ గ్రామాల గ్రామపంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.