గొడ్డు కారంతో ప్రభుత్వ పాఠశాలలో పెద విద్యార్థులకు అన్నం పెట్టడం దుర్మార్గం

Jun 27, 2025 - 15:10
 0  2

గట్టు మండలం, ఇందువాసి గ్రామ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో  మధ్యాహ్న భోజనం గొడ్డుకారంతో పెట్టారు

పర్యవేక్షణ లేని అధికారుల మీద చర్యలు తీసుకోవాలి

మాచర్ల ప్రకాష్ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్

జోగులాంబ గద్వాల 26 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గట్టు మండలం, ఇందువాసి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం  గొడ్డుకారంతో అన్నం పెట్టడం అన్యాయమని పేదవాళ్ళని చూసి ఉద్యోగస్తులు నాయకులు వారిని కనికరించడం లేదని సంఘటనను  ఈరోజు వార్త పేపర్లలో చూసి   భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇంచార్జ్ మాచర్ల ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు డీఈవో, ఎంఈఓ లు పర్యవేక్షణ లేకపోవడం  ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ,నాణ్యమైన భోజనం అందించాలనే సోయ లేకుండా నిర్లక్ష్యం వహించి బాధ్యత లేకుండా ఇక్కడున్న అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు , గోడ్డుకారంతో విద్యార్థులకు అన్నం పెట్టడం తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు  జిల్లా కలెక్టర్ తీసుకోవాలని అన్నారు నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లేదని అన్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు 

ఈ కార్యక్రమంలో కృపాకర్, ప్రవీణ్, మోహన్, రామకృష్ణ, నవీన్ ,జస్టిన్ ప్రభుదాస్ పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333