గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేసిన బిఆర్ఎస్ ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్

Dec 28, 2025 - 17:45
 0  221
గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేసిన బిఆర్ఎస్ ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్

 అడ్డగూడూరు 28 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో గెలుపొందిన సర్పంచులకు మండల కేంద్రంలో బిఆర్ఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న ఏ ఎన్నికలు వచ్చినా ఎస్సీ,ఎస్టీ  బీసీలు రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బి.ఆర్.ఎస్.ఎస్)రాష్ట్ర వ్యవస్థాపక  అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్  అన్నారు.ఆదివారం నాడు మండల కేంద్రంలోని ఇటీవల స్థానిక ఎన్నికలలో గెలుపొందిన బీసీ సర్పంచులకు  ఆత్మీయ సన్మానం చేశారు.ఈసందర్భంగా  శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ జనాభాలో 70శాతం ఉన్న బీసీలను అగ్ర కులాలకు రాజకీయ నాయకులు బీసీలను జెండాలను మోయించుకుంటూ జిందాబాద్ లు  కొట్టించుకుంటున్నారే తప్ప,రాజకీయంగా ఎదగనీవ్వకుండా కుట్ర  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా బీసీలు మేల్కొని రానున్న ఏ ఎన్నికలు వచ్చినా జనరల్ స్థానాల్లో కూడా బీసీలు సత్తా చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ ఇంచార్జి అనంతుల దేవాంజీ , మాజీ ఎంపిటిసి బాకీ బాలయ్య,బీసీ నాయకులు బొమ్మగాని లక్ష్మయ్య వివిధ గ్రామాల సర్పంచులు,రాచకొండ రమేష్ గౌడ్,ఏనూతుల ఉపేంద్ర నాగరాజు,పోలిశెట్టి బాలశౌరి,కన్నెబోయిన లింగస్వామి,చుక్క బాబు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333